Janasena: ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాట్లాడే వ్యాఖ్యలు కాస్త కామెడీగా అనిపిస్తాయి అంటూ చాలామంది విమర్శిస్తారు. కానీ ఆయన మాత్రం సరైన పాయింట్ ఆధారంగానే మాట్లాడుతూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన కేఏ పాల్ కూటమినేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకోబోతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నువ్వు పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ కు సహకరించు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా తనని క్యాబినెట్ లోకి తీసుకుంటానని మాయ మాటలు చెప్పారు.
ఇప్పుడు మాత్రం వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారు అయితే వర్మ మాత్రం నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండయ్యా అంటూ అమరావతిలో చంద్రబాబు చుట్టూ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు అంటూ కేఏ పాల్ ఆరోపించారు.
వర్మ నీకు అసలు బుద్ధుందా వాళ్ళు మాట నిలబెట్టుకోరు అని నేను అప్పుడే నీకు చెప్పాను. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మళ్లీ జనసేనలో చేరారని, అసలు ఆయనకు బుద్ది ఉందా అంటూ.. తెలివైన వాళ్లు ఎవరు కూడా ఆ పార్టీలో చేరరని ఆయన అన్నారు. మళ్లీ జనసేన గానీ కూటమి పార్టీలు కానీ తిరిగి అధికారంలోకి వస్తాయా తొమ్మిది నెలలకి కూటమి చాప్టర్ క్లోజ్ అయింది అంటూ కూటమి నేతలను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.