Ntr: మహానాడుకు రాబోతున్న ఎన్టీఆర్…. తెర వెనుక ఇంత కథ నడిచిందా?

Ntr: నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ ను గత కొద్దిరోజులుగా దూరం పెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎలాంటి వేడుకలు జరిగిన నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరైనప్పటికీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కు మాత్రం ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఆహ్వానించిన వారికి ఆ వేడుకలో అవమానం జరుగుతూనే ఉంది.

అయితే నందమూరి కుటుంబ సభ్యులందరికీ పెద్ద పండుగ లాంటి కార్యక్రమం తన తండ్రి ఎన్టీఆర్ పుట్టినరోజు అని చెప్పాలి. అదే విధంగా ఈ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది మహానాడు వేడుకను కడపలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మహానాడు కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనబోతున్నారు ఇలాంటి తరుణంలోనే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉంటుందా లేదా అన్న సందేహం కూడా అందరిలోనూ ఉంది. అయితే ఈ మహానాడు వేడుకకు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ను కూడా ఆహ్వానించారని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపి ఆయన అభిమానులలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారని తెలుస్తోంది అదేవిధంగా ఇటీవల కాలంలో నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీను చేతపట్టి అభిమానులలో జోష్ నింపారు.

ఇక కళ్యాణ్ రామ్ సైతం ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ జెండాతో అభిమానులను సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి మహానాడు వేడుక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కూడా మరింత ఆహ్లాదకరంగా మారబోతుందని ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనే విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.