న్యాయమూర్తి, పోలీసుల సమక్షంలో జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులని గుర్తించిన బాధితురాలు..

కొన్ని రోజుల కిందట హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. అందులో మేజర్ సాదుద్దీన్ అంశాలు కూడా జైల్లో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు జువెనైల్ హోమ్ లో ఉండగా తాజాగా బాధితురాలు ఆ నిందితులను గుర్తుపట్టింది.

పోలీసులు, న్యాయమూర్తుల ముందు తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు వీరే అని తెలిపింది. దీంతో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు బాధితురాలు సరైన వివరాలు చెప్పడంతో పోలీసులు ఆ వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వివరాలను కోర్టుకు కూడా అందజేయనున్నట్లు తెలిసింది.