అల్లు అడ్డాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా..!

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర సినిమా షూటింగ్స్ సహా ఎన్నో ఇతర షూటింగ్స్ పలు భారీ స్టూడియోస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్టూడియోస్ లో ఒకటిగా తెలుగు బిగ్ ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్ మరియు వారి కుటుంబ సారథ్యంలో స్థాపించిన స్టూడియో అల్లు స్టూడియోస్.

మరి అల్లు స్టూడియోస్ ఆరంభానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కాగా ఇక అక్కడ కూడా షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే ఈ అల్లు వారి స్టూడియోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జరగనుందట.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ కాంబినేషన్ లో ఈ ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు అల్లు స్టూడియోస్ లో మాత్రం ఎన్టీఆర్ సినిమా సెట్ పనులు జరుగుతున్నాయట.

దీనితో అయితే అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. ఇక ఈ భారీ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కావాల్సి ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.