Kannappa: ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీకి క్యూ కడుతున్నారు. కాగా ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి ఇలా చాలామంది నశించిన విషయం తెలిసిందే.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 300 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ అరగంట కనిపించినా ఆ సీన్స్ వచ్చినప్పుడు ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్, విష్ణుల మధ్య వచ్చే సీన్లు, డైలాగులకు అభిమానుల నుంచి మంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందీ.
ఈ సినిమా విజయంలో ప్రభాస్ రుద్ర పాత్ర కూడా హైలెట్ గా నిలిచిందని రివ్యూలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కన్నప్ప సినిమాని అనుకున్న సమయంలో చిత్ర బృందం రుద్ర పాత్రలో ప్రభాస్ కంటే ముందు మరొక హీరోను అనుకున్నారట. మంచు విష్ణు కూడా ఆ హీరోనే అనుకున్నారట. అయితే కొంత మంది మాత్రం ప్రభాస్ ను తీసుకుంటే బాగుంటుందని సలహాలు ఇచ్చారట. మరి ప్రభాస్ కాకుండా రుద్ర పాత్ర కోసం విష్ణు ముందుగా అనుకున్న హీరో ఎవరో కాదు ఎన్టీఆర్. మోహన్ బాబుతో పాటు చాలా మంది విష్ణుకు ప్రభాస్ పేరును సూచించారట. దీంతో విష్ణు వెంటనే ప్రభాస్ తో మాట్లాడి ఒప్పించారట. అయితే ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ రుద్ర పాత్రకు ప్రభాస్ పర్పెక్ట్ గా సూటయ్యాడని అభిమానులు చెబుతున్నారు.