Junior Ntr: రౌడీ బాయ్స్ పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్..?

Junior Ntr: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ సినిమాకు శ్రీ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభించింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 8 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీమేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఇద్దరు గ్యాంగుల మధ్య జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్ లలో విడుదల కానుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులతో పాటుగా చిత్రబృందం కూడా ఈ సినిమాను వెండితెరపై చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాతో ఆశిష్ హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఆశిష్ నటనకుగాను మంచి మార్కులు వస్తాయి అన్న నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడు. మరి ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందా.. లేదా తెలియాలి అంటే జనవరి 14 వరకు వేచి చూడాల్సిందే.