Jr Ntr: ఆర్ఆర్ఆర్ లో అల్లూరి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..?

Jr Ntr: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో పాత్రల్లో ఒదిగిపోయి ఎంత అద్భుతంగా నటిస్తారో, అదే విధంగా నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే విడుదల తేదీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 28న, లేదంటే మార్చి 18న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో తారక్ గోండు వీరుడు పాత్రలో నటించి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు అని నెటిజెన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను చూసే సమయంలో రామరాజు పాత్ర నిప్పుల నుంచి దూకి బాణం సంధించే సీన్ తనకు ఎంతగానో నచ్చింది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఆ సన్నివేశం ఎంతలా నచ్చింది అంటే ఆ పాత్రలో నేను నటించాలి అనిపించేలా అంటూ రామరాజు పాత్రపై కామెంట్లు చేశారు తారక్. ట్రైలర్ లో ఆ సన్నివేశం వచ్చిన సందర్భం తో పాటుగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా తనకు అలా అనిపించి ఉండవచ్చు అని ఎన్టీఆర్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తారక్ అభిమానులు,చెర్రీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే జనవరి 7న ఈ సినిమా విడుదల అయి ఉండేది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేది మరొకసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమాలు చిత్రబృందం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.