బాలయ్య కోసం రంగంలోకి జూ ఎన్టీఆర్..!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాని వచ్చే డిసెంబర్ 2 కి చిత్ర బృందం ఫిక్స్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బోయపాటి జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలో దింపే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

రానున్న కొన్ని రోజుల్లో జరగబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని ఈ సినిమాకి ప్రత్యేక అతిథి గా పిలవబోతున్నారట. లాస్ట్ టైం బాలయ్య ఎన్టీఆర్ కోసం వచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బాలయ్య కోసం వెళ్లడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రగ్యా హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు.