ఎట్టకేలకు తెలంగాణ లో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెడా ఊపింది. సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించంది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చి చెప్పింది. సచివాలయం కూల్చి వేయోద్దంటూ దాఖలైన పిటీషన్లను కొట్టేసింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వాదనలు వినిపించినా హైకోర్టు పట్టించుకోలేదు. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన సచివాలయం చరిత్ర చివరికి మట్టిలో కలిసిపోక తప్పలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సచివాలయం చరిత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటి నుంచి ఈ సచివాలయం సేవలందిస్తూ వచ్చింది. అటుపై 1956లో రాయలసీమ, కోస్తాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. అప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి గా పనిచేసారు. నాటి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు మారినప్పటికీ ఆ సచివాలయం సేవల నిరంతరాయంగా కొనసాగాయి.
నీలం సంజీవరెడ్డి 1956-60, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య, 1964లో నీలం సంజీవ రెడ్డి, 1964, ఫిబ్రవరి 29న కాసు బ్రహ్మానందరెడ్డి, 1971-73 వరకు పీవీ నరసింహారావు, 1973-78 వరకు జలగం వెంగళరావు, 1978-80 వరకు డా. మర్రి చెన్నారెడ్డి, 1980-82 వరకు టంగుటూరి అంజయ్య, 1982 ఫిబ్రవరి 24-సెప్టెంబర్ 20 వరకు భవనం వెంకట్రామ రెడ్డి, 1982 సెప్టెంబర్20-1983, జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1983-84 వరకు నందమూరి తారక రామారావు, 1984 ఆగస్టు 16-1984 సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కరరావు, 1984-1985 వరకు మళ్లీ ఎన్టీఆర్, ఆ తర్వాత 1985-1989 వరకు మళ్లీ ఎన్టీఆర్, 1989-90 వరకు మర్రి చెన్నారెడ్డి, 1990-92 వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, 1992-94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1994-95 వరకు ఎన్టీఆర్ఆ తర్వాత 1995-2004 వరకు చంద్రబాబు నాయుడు, 2004-2009 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2009-10 వరకు కొణిజేటి రోశయ్య, 2010-2014 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగించారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-19 వరకు ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడికి వచ్చేవారు. ఆయన ప్రగతి భవన్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే పాలించేవారు. ప్రస్తుతం అక్కడ నుంచే కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. నాటి నుంచి ప్రసిద్ధ కట్టడం సచివాలయం కూల్చివేతకు కేసీఆర్ కంకణం కట్టుకుని పనిచేసారు. హైకోర్టు మొదట్లో కూల్చివేతకు ససేమిరా అని చివరికి సోమవారం గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో సచివాలయం చరిత్ర మట్టిలో కలిసిపోయినట్లు అయింది.