ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను ఇటీవలే టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎండగట్టిన సంగతి తెలిసిందే. జగన్ ఏడాది పాలనను ఉద్దేశించి 100 కి 110 మార్కులంటూ ఎద్దేవా చేసారు. అమరావతి రైతుల దీక్షలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవరిస్తుందని మండిపడ్డారు. మా వాడు అంటూనే జేసీ చురకలంటిచారు. అయితే తాజాగా జేసీ బ్రదర్స్ వాహనాలు అధికారులు సీజ్ చేసి షాకిచ్చారు. బీఎస్ -3 వాహనాలు బీఎస్4 గా మార్చి అక్రమంగా నడుతుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వాహనాలను నాగాలాండ్ తో పాటు వేర్వేరు రాష్ర్టాల పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జేసీ బ్రదర్స్ కి సంబంధించిన 57 వాహనాలు సీజ్ చేసిన అధికారులు తాజాగా 4 టిప్పర్లను సీజ్ చేసారు. ఇంకా 154 వాహనాలు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగానే తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిపై కూడా త్వరలోనే చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఇక జేసీ అక్రమార్కుల గురించి ఇప్పటికే బోలెడన్ని ఆరోపణలున్నాయి. పోర్జరీ సంతకాలు చేసి, నకిలీ పత్రాలతో బెంగుళూరులోని లారీలను జేసీ ట్రావెల్స్ విక్రయించినట్లు గుర్తించారు. అయితే జేసీ జగన్ సర్కార్ పై చేసిన ఆరోపణలు సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే అధికారులు జేసీ వాహనాలు సీజ్ చేయడంతో ఇది కక్ష సాధింపు చర్యగానే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాగానే జేసీనే టార్గెట్ చేసారని ఇప్పుడు విమర్శలు ఎక్కువ అవ్వడంతో కక్ష సాధింపులకు దిగుతుందని మండిపడుతున్నారు. జగన్ ఇలాంటి సాధింపు చర్యలకు దిగకూడదని…అధికారం చేతిలో ఉందని అహం భావంతో ఉండకూడదని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం జేసీ ట్రావెల్స్ కి అడ్డు అదుపు లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో జేసీ ట్రావెల్స్ రంగంలో ఓ బ్రాండ్ అయిన సంగతి తెలిసిందే. చాలా రాష్ర్టాల్లో జేసీ ట్రావెల్స్ ఆయన బినామీల పేరిట ఉన్నాయి.