Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే .ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకోగా, పుష్ప 2 సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించారు ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో గురించి ప్రముఖ సీనియర్ నటుడు జెన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలో అల్లు అర్జున్ కు తనకు మధ్య జరిగిన సంఘటన గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంటి ఓనర్ గా నటించిన జెన్నీ వాళ్ళను ఎప్పుడూ ఇబ్బంది పెడతాడు…బేసిగ్గా ఆ సినిమాలో అల్లు అర్జున్ అంత ఓపికపట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా కోపిష్టి గా మారిపోయి జెన్నీ అనే నటుడిని కొడతాడు… ఆ కొట్టే సీన్ లో అల్లు అర్జున్ చెయ్యి తగిలి జెన్ని అనే నటుడి కళ్ళజోడు విరిగిపోయిందట.
ఇలా తన కళ్ళజోడు విరిగిపోవడంతో వెంటనే అల్లు అర్జున్ తన మేనేజర్ ని పిలిచి వెంటనే తనకు కళ్ళజోడు తెప్పించాలని చెప్పారట నేను వద్దని చెబుతున్న లేదండి మీరు చాలా సీనియర్ నటుడు నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అయితే పొరపాటున నా చెయ్యి తగిలి మీ కళ్ళజోడు విరిగిపోయింది. మీకు కళ్ళజోడు ఇప్పించాల్సిన బాధ్యత నాదే అంటూ అప్పటికప్పుడు అల్లు అర్జున్ నాకు కళ్ళజోడు తెప్పించారని జెన్నీ తెలిపారు అలాగే ఈ సందర్భంగా తాను అల్లు అర్జున్ ను ఒకటే కోరాను నాకు ఒక వరం ఇవ్వగలరా అంటే ఏంటో చెప్పండి అని అడిగారు మీ ప్రతి సినిమాలో నాకు ఒక పాత్ర ఇప్పించండి అని అడగడంతో అయ్యో అది పెద్ద వరమా? పక్కా ఇస్తాను అని చెప్పి ప్రస్తుతానికైతే కళ్ళజోడు తీసుకోండి అంటూ అతనికి కళ్ళజోడు ఇప్పించారట. అలా ఆయన అనుకున్న చేసిన మిస్టేక్ ని సరిదిద్దుకంటూనే జెన్నీ ఏజ్ కి గౌరవం ఇచ్చారని, బన్నీ చాలా సంస్కారవంతుడు అంటూ ఈ సందర్భంగా జెన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
