Shekar Movie: భర్త కోసం మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్..!

ShekarMovie: తాజాగా డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం “శేఖర్” . మలయాళ చిత్రం” జోసెఫ్” సినిమా రీమేక్ గా “శేఖర్” చిత్రాన్ని జీవిత రాజశేఖర్ డైరెక్షన్ లో నిర్మించారు . ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి . ఈ సినిమానీ వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి నిర్మించారు . ఈ చిత్రంలో రాజశేఖర్ హీరోగా నటించారు . రాజశేఖర్ కుమార్తె శివాని, రాజశేఖర్ కుమార్తెగా కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్రం నుండి రాజశేఖర్, శివాని ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది .

శేఖర్ సినిమాకు మొదటగా లలిత్ నీ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. కానీ లలిత్ స్థానంలో జీవితా రాజశేఖర్ ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలను తీసుకున్నారు . ఇందుకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ.. జీవిత రాజశేఖర్ చాలా సంవత్సరాల తర్వాత తన భర్త కోసం తిరిగి మెగా ఫోన్ అందుకున్నారు. ఇప్పటివరకు ఎవడైతే నాకేంటి ,శేషు, మహంకాళి చిత్రాలకు జీవిత రాజశేఖర్ డైరెక్టర్ గా బాధ్యత వహించారు . చాలా కాలం తర్వాత మరి ‘ శేఖర్ ‘ సినిమాకు డైరెక్షన్ చేశారు. జీవితంలో వ్యక్తిగత సమస్యల వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత , చుట్టూ జరిగే హత్యల వెనుక గల మిస్టరీ ఛేదించడాన్ని ఈ కథ ప్రధాన సారాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .

తాజాగా జీవిత రాజశేఖర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ..” రాజశేఖర్ గారికి 91వ చిత్రం” . ఈ సినిమాలో రాజశేఖర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. శివాని రాజశేఖర్ కుమార్తె పాత్రలు కనిపించనున్నారు. తండ్రి కూతురు కలిసి వెండితెరపై కనిపించబోతున్న తొలి చిత్రం ‘శేఖర్ ‘. వారిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని , ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆవిడ చెప్పుకొచ్చారు. తొందరలోనే ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేస్తామని ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడారు . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త గురించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదల చేయడానికి ప్రొడ్యూసర్ కి మంచి ఆఫర్స్ వచ్చాయట .