Janasena Party: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు అద్భుతమైన పాలనను కనబరుస్తున్నారు. అయితే ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో బలపడుతూ వస్తోంది. మరోవైపు బిజెపి కూడా తమ పార్టీని పటిష్టం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. గత ఎన్నికలలో జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ లభించింది. అదేవిధంగా గతంలో పార్టీని వీడిన వారందరూ కూడా తిరిగి సొంతగూటికి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మాజీ జెడి లక్ష్మీనారాయణ సైతం తన పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలవల్ల ఈయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు.. ఇలా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అంటూ సరికొత్త పార్టీ స్థాపించారు అయితే ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. ఈ తరుణంలోనే ఈ పార్టీని జనసేన పార్టీలో విలీనం చేస్తూ లక్ష్మీనారాయణ సైతం జనసేనలోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాలను చూసుకోవటానికి సరైన సమయం లభించడం లేదు ఇలాంటి తరుణంలోనే పార్టీ బాధ్యతలు తీసుకోవడం కోసం సరైన వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ సైతం వరుసగా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఈయన జనసేన పార్టీలోకి రావాలని చెప్పకనే చెబుతున్నారని స్పష్టమవుతుంది. ఇలాంటి తరుణంలోనే పవన్ ఆహ్వానిస్తే తన పార్టీని కూడా జనసేనలోకి విలీనం చేసి జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇలా జనసేనకు మరొక పార్టీ తోడైతే తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి మార్గం సులువు అవుతుందని తెలుస్తోంది.
