జయమ్మ పంచాయతీ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా పలు టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో సందడిగా ఉంటుంది. స్టార్ హీరోలు సైతం సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న క్రేజ్ ఎటువంటితో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు టీవీ షోలు మరొకవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉండే సుమ ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ మరింత బిజీ అయిపోయింది. తాజాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ అనే సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

మొదటిసారిగా జయమ్మ పంచాయితీ సినిమాలో సుమ ప్రధాన పాత్రలో నటించింది. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. యాంకర్ గా అందరి ప్రశంసలు అందుకున్న సుమ ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమా ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా
ఓటీటీలో ప్రసారం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జయమ్మ పంచాయతీ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 14వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మొన్నటి వరకు న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేసిన సుమ ఇటీవల హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. వచ్చి రాగానే నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ తన పనిలో బిజీ అయిపోయింది. ఈ విషయాన్ని సుమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.