Janhvi Kapoor : జాన్వీ కపూర్: ఊరించి.. ఊరించి.. తుస్ మనిపించి.!

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పట్లో టాలీవుడ్ తెరంగేట్రం చేయనట్లేనా.? ఇదిగో.. అదిగో అంటూ ఎన్నేళ్లగానో జాన్వీ కపూర్ ఊరిస్తోంది. అనుకున్న టైమ్‌కే జాన్వీ తెరంగేట్రం జరిగి వుంటే, తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుని వుండేది. తక్కువలో తక్కువ పది సినిమాలైనా చేసేసి వుండేది.
కానీ, ఎందుకో జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీపై జాప్యం అలాగే నడుస్తోంది. శ్రీదేవి బతికి వుంటే, ఈ పాటికే జాన్వీ కపూర్ ఎంట్రీ జరిగి వుండేది. కానీ, ఎందుకో పాపం జాన్వీ కెరీర్‌పై ఇలాంటి నీలి నీడలు కమ్ముకున్నాయ్. అలా అని బాలీవుడ్‌లోనైనా జాన్వీ కపూర్ వరుస పెట్టి సినిమాలు చేస్తోందా.? అంటే అదీ లేదు.
సెలెక్టివ్‌గా అది కూడా గ్లామర్‌కి దూరంగా వుండే సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్‌కి వున్న క్రేజ్ వెండితెరపై అంతగా కనిపించడం లేదు. అదే, తెలుగులో అయితే, తల్లి శ్రీదేవిలా ఓ రేంజ్ స్టార్ డమ్ దక్కించుకునేదేనేమో.
ఆ అర్హత జాన్వీ కపూర్‌కి లేకపోలేదు. శ్రీదేవి అంతటి అందగత్తె కాకపోయినా, అభినయంతో తన అందాన్ని ఎలివేట్ చేసుకోగల సత్తా జాన్వీ కపూర్‌కి వుంది. కానీ, ఇక ఇప్పుడు తెలుగులో జాన్వీకి క్రేజ్ కూడా పడిపోతూ వచ్చింది.
గతంలో మాదిరిగానే రీసెంట్‌గానూ ఓ వేడి వేడి ప్రచారం తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ‘జనగణమన’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నారు.
కానీ, అదంతా ఉత్తదే అని స్వయంగా జాన్వీ కపూరే తేల్చేసింది. ఇదంతా చూస్తుంటే, అసలు జాన్వీని టాలీవుడ్‌కి రానివ్వకుండా చేయడం వెనక ఎవరి హస్తమైనా వుందా.? అంటూ శ్రీదేవి అభిమానులు ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమో అయినా అయ్యొండొచ్చు.