తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో జరిగిన ఘటనపై ఏపీ మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక్కసారిగా రాజకీయ నాయకులంతా ఆధ్యాత్మికంవైపు మళ్లారు. నిజానికి అది చాలా దురదృష్టకరమైన ఘటన. అంతర్వేది ఆలయంలోని రథానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి రథాన్ని కాల్చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అందుకే చాలామంది హిందుత్వ వాదులు ఆ ఘటనను వ్యతిరేకిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణను కోరింది. దానికి సంబంధించి ఇవాళ తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే… రథం దగ్ధం వెనుక రాజకీయ కుట్ర ఏదో దాగి ఉంది.. అంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అవి ఛలో అంతర్వేదికి కూడా పిలుపునిచ్చాయి. ఇంతలోనే సీఎం జగన్.. సీబీఐకి విచారణను అప్పగించడంతో అన్న పార్టీల నాయకులు కాస్త సంయమనం పాటించారు.
అయితే… ఇలా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మన సనాతన ధర్మాన్ని మనమే పరిరక్షించుకుందాం.. అన్న మోటివ్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. దాని కోసం శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు అందరూ తమ ఇంటివద్దే దీపాలు వెలిగించాలంటూ ట్వీట్ చేశారు.
దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే, మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే..అంటూ పవన్ ట్వీట్ చేశారు.
అలాగే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు సీఎం జగన్ ఆదేశించడంతో.. జనసేన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే , మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే … pic.twitter.com/zgMNjsHKUx
— Pawan Kalyan (@PawanKalyan) September 10, 2020
విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది.
— Pawan Kalyan (@PawanKalyan) September 10, 2020