Janasena Counter Attack : తనను తాను రైతు బిడ్డనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమనీ, జగన్ రైతు బిడ్డ కాదు చంచల్‌గూడ జైలు బిడ్డ అని ఎద్దేవా చేశారు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్.
సో, ఇది కొత్త పద ప్రయోగమన్నమాట.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అని తెలుగునాట ఓ వ్యవహారికం వుంది. అలాగే తయారయ్యిందిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో పదే పదే ‘దత్త పుత్రుడు’ అని వైఎస్ జగన్ విమర్శిస్తోన్న దరిమిలా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘చంచల్‌గూడా జైలు బ్యాచ్.. సీబీఐ దత్త పుత్రుడు.. రాజన్న చెత్త పుత్రుడు.. దివాళా పుత్రుడు..’ అంటూ జనసేన ఎదురుదాడికి దిగుతున్న విషయం విదితమే.
అయితే, జనసేన నేతలది అరణ్య రోదనే అవుతోంది. చాలా అరుదుగా మాత్రమే టీడీపీ అనుకూల మీడియా, జనసేన నుంచి వచ్చే ప్రకటనల్నీ, జనసేన ప్రెస్‌మీట్ల సారాంశాన్నీ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, తాజాగా వైఎస్ జగన్.. రైతు భరోసా సొమ్ముని రైతుల ఖాతాలో వేసే కార్యక్రమానికి ఈ రోజు మరోమారు శ్రీకారం చుట్టగా, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు కూడా చేశారు. దానికి కౌంటర్ ఎటాక్ జనసేన నుంచి చాలా గట్టిగా వచ్చింది.
చంచల్‌గూడా జైలు బిడ్డ.. అనే జనసేన విమర్శ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు జాకీలేసి పైకి లేపుతన్నారో ఆయనకే తెలియాలి.