ఆ రోజుల్లో ఇప్పటి లా విడిగా కాకుండా షూటింగ్ సమయంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్లు. అలా ఒక రోజు అందరూ భోజనం చేయడానికి ఓ చెట్టు కింaదకు చేరారు. అప్పటికే ఎస్వీఆర్ తాగుడు అలవాట్ల గురించి రకరకాల పుకార్లు వినిపించేవి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జమున గారు ఆ భోజనం చేసే బ్యాచ్ లో ఉంది. అయితే ఆమె చూపు అంతా ఎస్వీఆర్ మీదే ఉంది. అసలు ఆయన తాగుడు గురించి తాను విన్నది నిజామా ? అబద్దమా ? అని తెలుసుకోవాలనేది జమున తాపత్రయం. అందరూ కూర్చున్నారు. భోజనాలు వడ్డిస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరి క్యారేజీ వారి ఇంటి నుండి వచ్చేది. కానీ ఎస్వీఆర్ కి మాత్రం క్యారేజీతో పాటు పెద్ద బాటిల్ కూడా వచ్చేది.
అయితే ఎస్వీఆర్ మందు తాగడం చూసారు జమున. అది గమనించిన అది ఎస్వీఆర్. ‘ఏమిటి పిల్ల. రుచి చూస్తావా ?, లేక అలాగే నన్నే చూస్తూ ఉండిపోతావా ?’ అని గంభీరంగా అన్నారు. దాంతో ఉలిక్కిపడ్డ జమున ‘లేదు అన్నగారు’ అంటూ తల దించుకుంది. దాంతో, ఎస్వీఆర్ కోపంగా ముందుకు వచ్చి.. అన్న గారు ఏమిటే.. మామ అని పిలువు, లేదా బావ అని పిలువు ‘ అంటూ హుంకరించారు. ఆ రోజు నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా జమున గారు ఎస్వీఆర్ ను మామగారు అని పిలిచేవారు.
అయితే, ‘గుండమ్మ కథ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు అర్ధరాత్రి ఎస్వీఆర్, జమున తలుపు తట్టారు. ఆ రాత్రి అంత ఆమె రూమ్ లోనే కూర్చుని ఎస్వీఆర్ గారు కూర్చుని తాగుతూనే ఉన్నారు. తాగుతూనే… జీవితంలో ఎలా ఉండాలి ?, ఎంత జాగ్రత్తగా ఉండాలి ?, లాంటి విషయాలను ఆమెకు చెబుతూ ఉన్నారట. .
ఉదయం 5 గంటల కు ఎస్వీఆర్ చిన్నగా పైకి లేచారు. ‘ఏమే పిల్ల.. ఆ కుర్ర వెధవతో నీ యవ్వారం విన్నా. అందరూ.. ఆడు మరో ఎన్టీఆర్ అంటున్నారు, కాదు వాడు మరో తాగుబోతు ఎస్వీఆర్. జాగ్రత్త. వాడికి దూరంగా ఉండు’ అని చెప్పి వెళ్లిపోయారంతా. జమున మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకా ఆ రోజు నుంచే జమున, హీరో హరినాథ్ కు దూరం అయ్యారు. హరినాథ్ కూడా మద్యానికి బానిసయ్యి మంచి కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకున్నారు.