టీడీపీపై ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డేలా జ‌గ‌న్ వ్యూహం!

గ‌డిచిన ఏడాది కాలంగా రాష్ర్టంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తేదాపా అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్ స‌ర్కార్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇదే సంద‌ర్భంలో మంత్రులు, శాస‌న స‌భ స‌భ్యులు కూడా ప్ర‌తిప‌క్షంపై ఎదురు దాడికి దిగి స‌రైన స‌మాధానం చెబుతూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంలో అనేక జిల్లాల్లో ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం వ‌ర‌కూ వెళ్లింది. ఒక‌ర్ని ఒక‌రు దూషించ‌కోవ‌డం..క‌య్యానికి కాలు దువ్వ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌తి ప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన విమ‌ర్శ‌ల‌కు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా స్పందించిన ఆ విమ‌ర్శ‌ల‌కు ధీటైన స‌మాధానం ఇచ్చారు.

తాజాగా ఏడాది పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా వైకాపా రాష్ర్ట వ్యాప్తంగా కేకులు క‌ట్ చేసి సంబురాలు చేసుకుంది. ఇదే సంద‌ర్భంలో విప‌క్షాలు దీపాలు ఆపి ఇది చీక‌టి ప్ర‌భుత్వం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారంపై వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. ప్ర‌జ‌ల నుంచి కూడా ప్ర‌భుత్వంపై కొంత వ్య‌తిరేక‌త అయితే ఉంది. ఆరంభంలో జ‌న‌గ్ చేసిన కొన్ని త‌ప్పిదాలు..ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి కొంచెం చెడ్డ పేరు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఒక్క దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా జ‌గ‌న్ జ‌నాల్లోకి వెళ్తోన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త‌ వ‌చ్చేలా, వైకాపా పాల‌న‌పై ప్ర‌జ‌లు ఆత్మ పరిశీల‌న‌ చేసుకునేలా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వైకాపా ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లు, అందుకోసం ఖ‌ర్చు చేసిన వ్య‌యం, గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పులు, అమ‌లు కానీ హామీలు, అసంపూర్తిగా వ‌దిలేసిన ప్రాజెక్ట్ లు, త‌దిత‌ర అంశాల‌పై పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల‌కు స్పష్ట‌త ఇచ్చి ప్ర‌తిప‌క్ష విమ‌ర్శ‌ల‌కు అదే వేదిక‌ల‌పై ప్ర‌జ‌ల‌తోనే సమాధానం చెప్పించేందుకు సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. 2014లో అధికారంలో కి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి టీడీపీ ప్ర‌భుత్వం రాష్ర్టానికి ఏం చేసింది? అన్న డేటా కూడా ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్నారుట‌. అలాగే ఆరంభంలో వైకాపా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు రావ‌డానికి కార‌ణాలు ఏంటి?అన్న‌ది కూడా నేరుగా ప్ర‌జ‌ల్నే అడిగి తెలుసుకునేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వినిపిస్తోంది.