Y.S.Jagan: పవన్ విషయంలో జగన్ మౌనం.. పెద్ద స్కెచ్ వేసిన జగన్?

Y.S.Jagan: ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అనే విధంగా నిత్యం విమర్శలు చెలరేగుతూనే ఉంటాయి. కూటమిలో మూడు పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. ఇందులో తెలుగుదేశం పార్టీకి అధిక ప్రాధాన్యత ఉంది. అనంతరం జనసేన తర్వాత బిజెపి పార్టీలకు రాష్ట్రంలో ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నికలలో పోటీ చేసి మంచి విజయాన్ని సాధించాయి. ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిత్యం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా తరచూ జగన్ మీద విమర్శలు చేయకపోయినా ఆయన మాట్లాడినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ నేతలకు తనదైన శైలిలోని కౌంటర్ ఇస్తుంటారు.

ఇటీవల కాలంలో వైసిపి నేతలను తొక్కినార తీస్తా కాళ్లు విరగొట్టి మూలన కూర్చోబెడతా అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి నుంచి అశైలిలోనే రీ కౌంటర్ ఉంటుందని అందరూ భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రెస్మీట్ లు పెట్టిన కేవలం చంద్రబాబు నాయుడుని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడటం లేదు.

పవన్ విషయంలో జగన్ మౌనం వెనుక కారణం ఏంటి అసలు ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారు అనే విషయాలపై సర్వత్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ పవన్ విషయంలో మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదని చెప్పాలి.పవన్ ని అనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైసీపీ పెద్దలు గ్రహించడం వల్లనే ఇలా అని అంటున్నారు. ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఇపుడు దగ్గర చేసుకునే పనిలో వైసీపీ ఉంది. అందువల్ల పవన్ ని విమర్శిస్తే వారు మళ్ళీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారందరూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక 175 స్థానాలలో పోటీ చేసే సత్త కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తూ ఆ పార్టీని బలహీన పరచటం,టీడీపీ పట్ల వ్యతిరేకత ఎంత పెంచితే అంత వైసీపీకి లాభం అన్న ఆలోచనతో కూడా బాబునే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఎప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడటం ఇక శృతిమించితే లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ జగన్ మాట్లాడలేదని తెలుస్తోంది.