Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల పరంగా ఎలాంటి అడుగులు వేయాలో ఇప్పటికి తెలుసుకున్నారా అంటే అవునని చెప్పాలి. ఎవరిని కదపాలి? ఎవరిని పక్కన పెట్టాలనే విషయాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఇన్నేళ్లకు బోధపడింది. జగన్ ఓటమిపాలు అయినప్పటి నుంచి తన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారని తెలుస్తోంది. జగన్ మాట తీరు ఆయన వ్యవహార శైలి చూస్తే మాత్రం స్పష్టమవుతుంది.
ఎన్నికలకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ను కరివేపాకుల తీసిపారేసే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా వెనకాడుతున్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ముగ్గురు భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బహిరంగ సభలలో కూడా ప్రస్తావించేవారు. గతఏడాది నుంచి పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా ఈయన ఇష్టపడటం లేదు.
పవన్ కళ్యాణ్ పేరును పలికితే తన పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా బోధపడింది. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తన ఓటు బ్యాంకు తగ్గుతుందనే విషయం ఇన్నాళ్లకు జగన్మోహన్ రెడ్డికి బోధపడింది. జగన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంటే యువత వైసీపీకి దూరంగా ఉంది. అంతేకాదు..కీలకమైన కాపు నాయకులు, ఆ సామాజిక వర్గం కూడా వైసీపీకి దూరమైంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించింది. గాజువాక వంటి నియోజకవర్గంలో పార్టీ పతనా వస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా పవన్ పాటే పాడితే.. మరింత ఇబ్బందులు వస్తాయని సీనియర్లు కీలక సూచనలు కూడా చేశారని తెలుస్తుంది.
ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ పేరును వ్యక్తిగతంగా, రాజకీయాల పరంగా ఎక్కడ విమర్శించకుండా కేవలం చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ గురించి తరచూ ప్రస్తావనకు తీసుకువస్తున్నారు.