ఇందిరమ్మకు జగన్ అదే పోలిక

indira and jagan telugu rajyam

 ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దీ నెలలుగా ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మధ్య పొసగటం లేదన్న విషయం తెలిసిందే, ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 70 కి పైగా తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద, వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం చర్చనీయాంశం అయ్యింది. ఆ లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

Cm Jagan AP High Court Telugu Rajyam

 గతంలో ఇందిరాగాంధీ కి కూడా దాదాపు ఇలాంటి అనుభవమే ఎదురైయ్యింది. ఆమె ప్రధాన మంత్రి గా తీసుకున్న అనేక నిర్ణయాలను సుప్రీంకోర్టు వ్యతిరేకించటమే కాకుండా మూడు నాలుగు చట్టాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల కంటే కూడా ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి స్థితిలో ఇందిరా సుప్రీం మీద యుద్ధమే ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోనే న్యాయకోవిదులైన బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్ ఆర్ గోఖలేను కేంద్ర న్యాయశాఖ‌ మంత్రిగా, మరో న్యాయకోవిదుడు మోహన్ కుమారమంగళంను ఉక్కుశాఖ మంత్రిగా,మరో న్యాయకోవిదుడు సిద్ధార్థ శంకర్ రే ను విద్యాశాఖ మంత్రిగా నియమించుకుంది.

వీళ్ళ మద్దతుతో సుప్రీంకోర్టు మీద దాదాపు విజయం సాధించింది ఇందిరా, ఇదే క్రమంలో సుప్రీంకోర్టు లో సీనియర్ జడ్జీలను కాదని వాళ్ళకంటే జూనియర్ అయినా ఏ ఎన్ రే ను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇందిరా గాంధీ ప్రభుత్వం నియమించింది . ఈ నియామకాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించినా శ్రీమతి ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి ఆ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశారు. అప్పట్లో ఇందిరకు ప్రత్యుర్థులుగా కామరాజ్ నాడార్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఉండటం వలన కావచ్చు, ఆమె తీసుకునే నిర్ణయాలు చట్టాలకు విరుద్ధంగా వుంటటం వలన ఏమో కానీ, ఆమెకు కోర్టు నుండి ఎదురుదెబ్బలు తప్పలేదు. దాదాపుగా సీఎం జగన్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుంది.

indhira gandi telugu rajyam

  1971 ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధులపై మొత్తం 518 లోక్ సభ స్థానాల్లో పోటీచేసి 352 స్థానాల్లో భారీ విజయం సాధించింది ఇందిరాగాంధీ . ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో గెలిచి భారీ విజయం సాధించాడు. ఇక్కడ జగన్ కు ప్రత్యుర్థులుగా రాజకీయానుభవం కలిగిన నేతలు వున్నారు. వాళ్ళ వేసే ఎత్తుగడలు కావచ్చు, జగన్ తీసుకునే నిర్ణయాలు చట్టానికి వ్యతిరేకంగా వున్నయామో కానీ కోర్టు నుండి ఎదురుదెబ్బలు తప్పటంలేదు. ఇందిరాగాంధీ కి ఉన్న వెలుసుబాటు జగన్ కి లేదు (న్యాయమూర్తులను సిఫార్సు చేసే అధికారం ). కాబట్టి కోర్టు తీర్పుల విషయంలో న్యాయకోవిదులు సలహాలు తీసుకోని పోరాటం చేయటం, అదే సమయంలో తాను చేసే చట్టాల విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించి జీవోలు విడుదల చేయటం చేయాలి. ప్రస్తుతం సీఎం జగన్ హైకోర్టు మీద పోరాటం చేయటానికే నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ పోరాటం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.