టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతాయి అన్నది వాస్తవం. చెప్పిన దానికి..చేసే దానికి ఎంత మాత్రం సంబంధం ఉండదు. అందుకే అమరావతి కేవలం గ్రాఫిక్స్ రాజధానిగా మిగిలిపోయింది. లేదంటే కనీసం ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా అక్కడ వెలిసేది. ఆయన వెర్షన్ లో మాటలకు..చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుంది అనడానికి ఈ పరిస్థితినే మంచి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇక జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర పాలన ఎంత సుభిక్షంగా సాగిందో చెప్పాల్సిన పనిలేదు. మేనిఫెస్టో లో చెప్పింది చెప్పినట్లు 90 శాతం వాగ్ధానాలు నెరవేర్చారు.
మాట తప్పడు..మడమ తిప్పడు అనడానికి ఏడాది పాలనలోనే నిరూపించుకున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు ముంపుకు గురైన సందర్భంగా మంగళవారం ఆ ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికారులందర్నీ పునరావాస కేంద్రాల వద్దే ఉండాలని తానే స్వయంగా అక్కడికి వస్తున్నానని ఎవరూ అక్కడి నుంచి కదలడానికి వీలు లేదని జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బయలు దేరే ముందు అదేశాలు జారీ చేసారు. అంతకు ముందు ఆ రెండు జిల్లాల్లో కలెక్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమై పరిస్థితులు సమీక్షించారు.
అదే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు అయితే జగన్ కు భిన్నంగా ఉంటుంది. అధికారులంతా చంద్రబాబు నిర్ధేశించిన ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. హెలిపాడ్ దిగడానికి, చంద్రబాబు కాలికి బురద అంటుకోకుండా ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ ప్లాన్ చేసుకుని అధికారులని పిలిపించి మాట్లాడి వెళ్లిపోతారు. ఆ తర్వాత అధికారులంతా సామాన్య జనాన్ని మీ చావు మీరు చావండని వదిలేసి వెళ్లిపోతారు. దీన్ని పచ్చ మీడియా తమకు అనుకూలంగా రాసుకుంటుంది. చంద్రబాబు స్వేదం చిందించాడు..రేయింబవళ్లు స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఊదరగొడతారు. ఇంకా అవసరం అనుకుంటే చంద్రబాబు చొక్కా విప్పి రంగంలోకి దిగిపోయారు అని కూడా రాయడం పచ్చ పత్రికలకే చెల్లుతుందేమో.