జగన్ మరో కీలక నిర్ణయం.. వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి

cm jagan ap

 సీఎంగా ఎన్నికైన నాటి నుండి జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పాదయాత్ర చేస్తున్న సమయంలో తనకు ఎదురైనా అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.

cm jagan ap

 వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని డిసెంబరు 21న ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియ ప్రారంభంకాబోతోంది. జగన్ తన పాదయాత్ర సమయంలో భూ సమస్యల పరిష్కారానికి హామీ మేరకు భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన చట్టం రూపొందించి, బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వచ్చేఏడాది జనవరి 1 నుంచి మొదలుపెట్టాలనుకున్న సర్వేను పది రోజులు ముందుగానే.. అంటే ఈనెల 21 నుంచే ప్రారంభించబోతున్నారు.

 వ్యవసాయ భూములు, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లోనూ రీసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. భూముల రీ సర్వే కోసం కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. 2023 వరకు ఈ సర్వే ప్రక్రియ కొనసాగనుంది. భూములను సర్వే చేసే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, డ్రోన్లు, కార్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రీసర్వే కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే ప్రాజెక్టు కోసం 987.46 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి.

 సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. అదే సమయంలో మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. బ్రిటీష్ కాలంలో చేప్పట్టిన భూసర్వే రికార్డ్స్ ను ఇప్పటికి ఉపయోగిస్తున్నారు. దీని వలన అనేక భూ వివాదాలు జరుగుతున్నాయి. జగన్ సర్కార్ చేపట్టబోతున్న ఈ సర్వే వలన అలాంటి వాటికీ చెక్ పెట్టె అవకాశం మెండుగా ఉండనుంది