Nagarjuna: సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతాయి. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి కానుకగా ఏకంగా పాన్ ఇండియా సినిమాలు పోటీ పడుతూ పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. అయితే కరోనా ప్రభావం వల్ల ఈ సినిమాలు వెనక్కి తగ్గడంతో బంగార్రాజు సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సినిమా టికెట్లు తక్కువగా ఉండటమే కాకుండా నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆ ప్రభావం బంగార్రాజు సినిమా పై పడుతుందని అందరూ భావించారు.
అయితే పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ విధించడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించిన ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను ఈ నెల 18వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఓ సామాజిక వర్గం ఈ విషయంపై స్పందిస్తూ నాగార్జున సినిమా టికెట్లు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో జగన్ నాగార్జునకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఓ సామాజిక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. కేవలం నాగార్జున జగన్ కు అనుకూలంగా మాట్లాడటం వల్లే జగన్ నాగార్జున పై తన అభిమానాన్ని చాటుకున్నారనే ప్రచారం మొదలైంది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో బంగార్రాజు సందడి చేయడం ఖాయమని నాగార్జున ఖాతాలో ఈ సినిమా హిట్ అందుకోవడం పక్కా అని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.