కరోనా కారణంగా ఉన్న ఉద్యగాలే ఊడిపోయాయి. నష్టాలను అధిగమించాలన్న కారణంగా నిర్ధాక్షణ్యంగా కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాల్ని తొలగించాయి. దాదాపు ప్రయివేటు ఉద్యోగులంతా ఖాళీ అయిన పరిస్థితి. ప్రస్తుతం ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితి ఎదురైంది. పీహెచ్ డీ చేసి వ్యవసాయం చేస్తున్న పరిస్థితులు. ఎంటెక్ చదివి ఉపాధి హామీ పథకానికి వెళ్లాల్సిన పరిస్థితులు దేశంలో దాపరించాయి. చరిత్ర ఎన్నడు లేని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పరిస్థితులు. ఇలాంటి ఆ పత్కాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం నోటిఫికేషన్ల జోరు తగ్గించలేదు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1036 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చిత్తూరు , నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని ఈ ఉద్యోగాలున్నాయి. నెల్లూరులో 273, చిత్తూరులో 374, గుంటూరు 239, శ్రీకాకుళం లో 85, తూర్పు గోదావరి జిల్లాల్లో 65 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు నొటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా అభ్యర్ధులు సెప్టెంబర్ 1వ తేది లోపు, తూర్పు గోదావరి అభ్యర్ధులు సెప్టెంబర్ 4వ తేదీలోపు, గుంటూరు జిల్లా అభ్యర్ధులు సెప్టెంబర్ 5వ తేదీలో పు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధులంతా ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాల్లో మిగిలిన 16 వేల పైచీలుక ఉద్యోగాలకు ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో రంగం సిద్దం అవుతోంది. ఆ రకంగా మరో రెండు-మూడు నెల్లో పదహారు వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఏ రాష్ర్టం కూడా కరోనా కాలంలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే నొటిఫికేషన్ల ఊసే ఎత్తలేదు. రైల్వే శాఖ రెండేళ్ల క్రితం `ఎన్ టీ పీసీ`, `గ్రూప్ -డి` క్యాటగిరీలకు నొటిఫికేషన్లు జారీ చేసింది కానీ ఇప్పటివరకూ ఆ పోస్టుల భర్తీ పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పాలనలో తన మార్క్ వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.