YSRCP: గబ్బర్ సింగ్ నటుడికి నడిరోడ్ పై చుక్కలు చూపించిన వైసీపీ ఫ్యాన్స్… పద్ధతి కాదంటూ?

YSRCP: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు ఎంతో మంది రాజకీయాలలోకి వచ్చారు అయితే సమయం సందర్భం లేకుండా సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడటం వంటివి చేస్తున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇక సినీ నటుడైన పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ గ్యాంగ్ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు.

ఇలా గబ్బర్ సింగ్ గ్యాంగ్ లో ఒకరైన సాయి ఇటీవల వైసిపి మహిళా నేతలు అయిన యాంకర్ శ్యామల సినీనటి రోజా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పంది పిల్ల బర్రె పిల్ల అంటూ వారిని సంబోధించి మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వైసిపి నా కొడుకులు అంటూ సాయి మాట్లాడిన నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి తనకు ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో ఫోన్లు వచ్చాయని తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని సాయి తెలిపారు. నేను అలా మాట్లాడటం తప్పైందని తనని క్షమించాలని ఈయన మరొక వీడియోని కూడా వదిలారు.

ఇలా వైసిపి కార్యకర్తలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఈయనని మాత్రం ఇంకా వైసిపి కార్యకర్తలు వదిలిపెట్టలేదని తెలుస్తుంది తాజాగా హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారులో వెళ్తూ సాయి కనిపించారు. ఇందులో భాగంగానే వైసిపి అభిమాని తనతో మాట్లాడుతూ మీరు మాట్లాడింది చాలా తప్పన్న ఇంకొకసారి అలా మాట్లాడితే పద్ధతిగా ఉండదు అంటూ నడి రోడ్డుపైనే వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే అక్కడి నుంచి సాయి తన కారులో వెళ్ళిపోయారు. ఇలా వైసిపి నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటంతోనే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.