జ‌గ‌న్ బాల‌య్య ఫ్యాన్..ప్రింట్ సాక్ష్యం ఇదిగో

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌ట‌సింహ బాల‌కృష్ణకు వీరాభిమాని అంటూ సోష‌ల్ మీడియాలో చాలా కాలంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ బాల‌య్య అభిమాని అవ్వ‌డానికి కార‌ణంగా బాల‌య్య యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ సినిమాల‌‌ని చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య అంటే జ‌గ‌న్ చెవి కోసేసుకునేంత అభిమానం చూపిస్తార‌ని..ఆయ‌న సీఎం అయిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారం మ‌రింత ఎక్కువైంది. జ‌గ‌న్ చ‌దువుకుంటోన్న రోజుల్లో క‌డ‌ప లో బాల‌య్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా ఉండేవార‌ని ఇటీవ‌లే బాల‌య్య కూడా తెలిపారు. ప్రెసిడెంట్ గా ఆ జిల్లా యాక్టివిటీస్ మొత్తం జ‌గ‌న్ దగ్గ‌రుండి చూసుకునే వార‌ని అంటుంటారు.

తాజాగా అది నిజ‌మే అనిపించ‌డానికి ఓ సాక్ష్యం దొరికింది. 1999 ఏడాదిలో విడుద‌లైన స‌మ‌ర‌సింహారెడ్డి అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. బాల‌య్య కెరీర్ లో ఆ సినిమా ఓ మైల్ స్టోన్. వంద రోజులు ఆడిన సినిమా. కొన్ని కేంద్రాల్లో 365 రోజులు కూడా ఆడింది. బాల‌య్య గ‌త చిత్రాల బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన సినిమా. బాల‌య్య ను న‌టుడిగా మ‌రో కొత్త ఐడెంటీటిని తెచ్చిన పెట్టిన సినిమాగాను నిలిచింది. ఇక అభిమానులు హీరోల ప‌ట్ల ఎలాంటి అభిమానం చూపిస్తారో తెలిసిందే. త‌మ అభిమాన హీరో ఫోటోని హైలైట్ చేస్తూ ఆ కింద త‌మ ఫోటోని పెట్టుకుని సంబ‌ర‌ప‌డుతుంటారు.

స‌రిగ్గా ఇలాంటి ఆధార‌మే దొరికింది. స‌మ‌ర‌సింహారెడ్డిలోని బాల‌య్య స్టిల్.. ఆకింద‌నే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోటో అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా వేయ‌డం జ‌రిగింది. 2000 ఏడాది నూత‌న సంవ‌త్స‌ర శుభాకాక్ష‌ల‌తో ఆ పోస్ట‌ర్ వేసారు. అలాగే ఆ సినిమా కొన్ని కేంద్రాల్లో 365 రోజులు ఆడిన‌ట్లు వేసుంది. క‌డ‌ప జిల్లా బాల‌య్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా జ‌గ‌న్ పేరు ఉంది. ఇప్పుడీ ప‌ప‌ర్ క‌ట్టింగ్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుంది. బాల‌య్య రెండు రోజుల క్రిత‌మ జ‌గ‌న్ నా అభిమానంటూ ఓ ఇంట‌ర్వూలో రివీల్ చేసారు. ఇంత‌లో పేప‌ర్ క‌టింగ్ ఫేస్ బుక్ ,ఇన్ స్టా, ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల్లో వైర‌ల్ సునామీ అంత‌టా చ‌ర్చ‌కొచ్చింది.