ధోని వ్యూహంతో గెలిచిన భార‌త్.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన జ‌డ్డూ

క‌రోనాతో ఏడెనిమిది నెల‌ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న క్రికెట‌ర్స్ ఐపీఎల్‌తో మ‌ళ్ళీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. హోరాహోరీగా సాగిన సిరీస్‌లో ఆట‌గాళ్ళు త‌మ ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్టుగా రాణించారు. ఇక ఐపీఎల్ పూర్తైన వెంట‌నే ఇండియ‌న్ జ‌ట్టు యూఎస్ ఫ్లైట్ ఎక్కింది. అక్క‌డ మూడు వ‌న్డేలు, మూడు టీ 20లు, నాలుగు టెస్ట్‌లు ఆడుతుంది. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్ పూర్తి కాగా, అందులో భార‌త్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆఖ‌రి వ‌న్డేలో మాత్రం అతిక‌ష్టం మీద‌ గెలిచి ప‌రువు నిలుపుకుంది.

బుధ‌వారం జ‌రిగిన చివరి వ‌న్డేలో భార‌త్ 152/5తో చాలా క‌ష్టాల‌లో క‌నిపించింది. ఆ స‌మ‌యంలో క్రీజులోకి వచ్చిన జ‌డ్డూ హార్దిక్ పాండ్యాతో క‌లిసి 150 పరుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6) – రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6) జోడీ టీమిండియాకి 302 పరుగుల గౌరవప్రదమైన స్కోరుని అందించింది. వీరిద్ద‌రి వ‌ల‌న‌నే ఇండియాకు చెప్పుకోద‌గ్గ స్కోరు వ‌స్తుంద‌ని ఎవరు ఊహించ‌లేదు. త‌మ‌దైన శైలిలో రెచ్చిపోతూ ఆసీస్ బౌల‌ర్స్ వ‌ణికిపోయేలా చేశారు. చివరి 7 ఓవర్లలో భారత్ ఏకంగా 93 పరుగులు రాబ‌ట్టాల‌రంటే వారి అరాచకం ఏ విధంగా సాగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే ఈ మ్యాచ్‌లో ముందు చాలా నెమ్మ‌దిగా ఆడిన జడేజా త‌ర్వాత అంతలా రెచ్చిపోవ‌డం వెనుకు ధోని వ్యూహం ప‌నిచేసింద‌ట‌. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జ‌డేజా తొలుత భాగ‌స్వామ్యం నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చా. ఇది ధోని ద‌గ్గ‌ర నేర్చుకున్నాం. సుదీర్ఘకాలం టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ధోనితో క‌లిసి ఆడుతున్న జ‌డేజా నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ఎప్పుడూ ధోనీ ఒక మాట చెప్తుండేవాడు.. మ్యాచ్‌ని మనం చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగితే..? ఆఖరి 4-5 ఓవర్లలో భారీగా పరుగులు పిండుకోవచ్చని. అదే ప్లాన్‌తో నేను మూడో వన్డేలో ఆడా’’ అని రవీంద్ర జడేజా వెల్లడించాడు. ధోని కూడా మొద‌ట్లో క్రీజులో నిల‌దొక్కుకునేందుకు చాలా సేపు ప్ర‌య‌త్నించి ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో రెచ్చిపోతున్న సంగ‌తి తెలిసిందే.