కొత్త కారూ కొని అందరికీ షాక్ ఇచ్చిన జబర్థస్త్ భామ రీతు.. ఫోటో వైరల్!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. హైపర్ ఆది జబర్దస్త్ షో కి వచ్చిన తర్వాత ఈ షోలో లేడీ గెటప్ ల సంఖ్య తగ్గి లేడీ కంటెస్టెంట్ లు కమెడియన్లుగా ఫేమస్ అవుతున్నారు. అలా జబర్థస్త్ ద్వార ఫేమస్ అయిన లేడి కంటెస్టెంట్ లో రీతు చౌదరి కూడా ఒకరు. మొదట్లో జబర్దస్త్ లో అడపాదడపా స్కిట్ లు చేసిన రీతు చౌదరి ప్రస్తుతం ప్రతి వారం పూర్తి స్కిట్ లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అజర్ తో కలిసి చేసే లవ్ ట్రాక్ లతో మరింత ఫేమస్ అయ్యింది.

జబర్థస్త్ లో లవ్ ట్రాక్ లకు కొదవ లేదు. ఇదివరకే సుధీర్ – రష్మి , వర్ష – ఇమాన్యుయేల్, రాకేష్ – సుజాత జోడిల ట్రాకులు బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వరుసలో రీతు- అజర్ జంట కూడా చేరింది. రేటింగ్స్ పొందటానికి మల్లేమల వారు ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారు. రీతు ఇలా జబర్థస్త్ లోనే కాకుండా పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. అంతే కాకుండా ఆమె ఒక సీరియల్ లో కూడా నటిస్తూ టెలివిజన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇదిలా ఉండగా రీతు ఇటీవల ఒక కొత్త కారు కొనుగోలు చేసింది.

సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో సందడి చేసే ఇటీవల తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో టీవి సెలబ్రిటీలు ఎక్కువగా థార్ కారును కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఎక్కువగా ఈ కారును కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో రోడ్లమీద ఎక్కడ చూసినా కూడా ఈ కార్లే దర్శనమిస్తున్నాయి. వీరి లాగే రీతు చౌదరి కూడా థార్ కారు కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. రీతు కొత్త కారు పక్కన నిల్చొని దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.