Jabardasth: ప్రోమోలతో ప్రేక్షకులను మోసం చేస్తున్న జబర్థస్త్ షో..!

Jabardasth: బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షో లలో జబర్దస్త్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ రేటింగ్స్ పడిపోయాయని చెప్పటంలో సందేహంలేదు. ఎందుకంటే ఈ కామెడీ షో లో టాప్ కమెడియన్లుగా కొనసాగుతున్న హైపర్ ఆది, సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. వీరి స్కిట్లు లేకపోవటంతో జబర్దస్త్ చూసే ఇంట్రెస్ట్ పోయింది.

దీంతో ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో జబర్దస్త్ యాజమాన్యం నానా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గత వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో రష్మీ పెళ్లి చేసుకోబోతున్నట్లు చూపించారు. రష్మి ని పెళ్లి కూతురు గా ముస్తాబు చేసి పీటల మీద కూర్చోబెట్టరు. పక్కన ఉన్న పెళ్ళికొడుకు కనిపించకుండా మొహం మొత్తం పూలతో కవర్ చేశారు. దీంతో ప్రేక్షకులు రష్మి ని పెళ్లి చేసుకోబోయేది ఎవరో తెల్సుకోవాలి అని ఏంతో ఆసక్తిగా ఈ ఎపిసోడ్ చూసారు.

కానీ ఆ ఎపిసోడ్ లో రష్మి పెళ్లికి సంబంధించిన స్కిట్ లేకపోవటంతో ప్రేక్షకులు కొంత వరకు అసహనం చెందారు. దీంతో రష్మి పెళ్లి స్కిట్ ఎందుకూ డిలీట్ చేసారు అంటూ అనుమనపడుతున్నారు. ఆ సమయంలో రష్మి స్కిట్ లేకపోవటానికి గల కారణం బయటపెట్టారు. నిజానికి అది ఈ వారం జరగబోయే ఎపిసోడ్ లో వచ్చే స్కిట్. కానీ ప్రేక్షకులలో ఆసక్తి పెంచటానికి ఇలా ఈ వారం వచ్చే స్కిట్ ని గతవారం వచ్చిన ప్రోమో లో చూపించారు. దీంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు మరి అంత పిచ్చివాళ్ళల కనిపిస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.