పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ వినోద్… మహాలక్ష్మి పుట్టిందంటూ ఎమోషనల్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ వినోద్ ఒకరు. ఈయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ముఖ్యంగా లేడీ గెటప్ ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్ తన కూతురిని వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వినోద్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సీమంతానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకున్నారు.

క్యాష్ కార్యక్రమంలో భాగంగా సుమ వినోద్ భార్యకు సీమంతం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇలా తన భార్య గురించి పలు సందర్భాలలో వినోద్ అభిమానులతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే గర్భవతిగా ఉన్న తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వినోద్ తన బిడ్డ పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తనకు కూతురు పుట్టడంతో మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేశారు..ఈ క్రమంలోనే ఈ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా పాప ఎంతో ముద్దుగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమంలోకి లేడీ కమెడియన్స్ రావటం వల్ల లేడీ గెటప్ రాకపోవడంతో పలువురి జబర్దస్త్ కమెడియన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.