బుల్లితెర జోడిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వర్ష ఇమ్మానియేల్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుడిగాలి సుధీర్ రష్మీ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ జోడీ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరి స్కిట్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వీరిద్దరు చేసే స్కిట్ లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట కూడా ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల గురించి ఎప్పుడు క్లారిటీగా స్పందించని ఈ జంట ఎట్టకేలకు స్పందించారు. తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇంద్రజ వర్షను ప్రశ్నిస్తూ సాధారణంగా ప్రేమలో ఉండే వారి మధ్య చిన్న చిన్న అనుమానాలు గొడవలు ఉంటాయి మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ అలాంటి గొడవలు జరగలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నా జీవితంలో ఇమ్మూ ఎంతో లక్కీ అంటూ సమాధానం చెప్పారు.
ఎవరైనా ఈ అమ్మాయి ఏంటి? ఈ అబ్బాయి ఏంటీ? అనుకున్న పరవాలేదు. ఎవరేమనుకున్నా నువ్వంటే నాకిష్టం. అంటూ తన మనసులో మాట చెప్పారు. వర్ష అక్కడి నుంచి వెళుతూ ఇమ్మూ మీ మమ్మీకి చెప్పు నీ కోడలు వస్తుందని అంటూ అక్కడినుంచి సిగ్గుపడుతూ వెళ్లారు. ఈ విధంగా వర్ష ప్రేమలో ఉన్న విషయాన్ని ఇలా బయటపెట్టారా లేకపోతే ఇది కూడా స్కిట్ లో భాగమేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.