జబర్దస్త్ వర్ష ప్లాస్టిక్ సర్జరీ… విషయం బయటపెట్టిన బుల్లెట్ భాస్కర్?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించిన మొదట్లో ఆ షోలో మగవారి లేడీ గెటప్ వేసుకొని స్కిట్స్ చేసేవారు. కానీ ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా లేడీ క్యారెక్టర్లు పెరిగిపోయాయి. ఇలా జబర్దస్త్ లో చాలామంది లేడీ కమెడియన్లుగా ఫేమస్ అయ్యారు. అలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. ఇక జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ లు చాలా ఎక్కువ. ఇక ఈ షోలో బాడీ షేమింగ్ గురించి వేసే కౌంటర్లు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రోహిణి , వర్ష బాడీ షేమింగ్ గురించి ఎక్కువ కామెంట్లు వినిపిస్తున్నాయి. రోహిణి లావుగా ఉండటం వల్ల ఆమె మీద కామెంట్లు చేస్తే..అందంగా ఉన్న వర్ష గురించి కూడా బాడీ షెమింగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

వర్షని లేడీ గెటప్, మగాడు, కీచు గొంతు అంటూ నానా రకాలుగా ఆమె మీద కౌంటర్లు వేస్తుంటారు. అయితే వర్ష వాటిని పాజిటివ్ గా తీసుకుంటుంది. అయితే హీరోయిన్ల లాగే వర్ష కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో జబర్దస్త్ లో వారి జీవితంలో జరిగిన సంఘటనల మీద కూడా స్కిట్ చేస్తూ ఉంటారు. అయితే వర్ష ప్లాస్టిక్ సర్జరీ ల గురించి కూడా చాలాసార్లు జబర్దస్త్ లో కౌంటర్లు వేశారు. అంటే వర్ష నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తోంది. ఇక ఈవారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో వర్ష బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో చేసింది. ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ అరుంధతి సినిమా స్పూఫ్ చేశాడు.

ఈ స్కిట్ లో మొదట వర్ష అరుంధతిగా నటించగా తర్వాత పైమా ఆ క్యారెక్టర్ చేసింది. ఇక ఈ స్కిట్లో ఇమాన్యుల్ పశుపతి క్యారెక్టర్ లో నటించాడు. ఇక ఈ స్కిట్ లో వర్ష ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఎవరు అని రశ్మిని చూపిస్తూ అడుగుతుంది.ఆమె రష్మీ అనే మహారాణి.. ఆమె రాజు పక్క రాజ్యానికి దండెత్తడానికి వెళ్లాడు అందుకే పక్క చూపులు చూస్తోందంటూ రష్మి మీద కౌంటర్లు వేస్తాడు. ఆ తర్వాత మన ఖజానా ఎలా ఉంది? అని వర్ష అడుగుతుంది. అస్సలు బాగా లేదు అని అంటాడు భాస్కర్. ఏమైంది? అని వర్ష అంటే.. ఉన్నదంతా మీ ప్లాస్టిక్ సర్జరీలకు అయిపోయింది అని కౌంటర్లు వేస్తాడు. దీన్నిబట్టి చూస్తుంటే వర్ష నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా ? అని ప్రేక్షకులు అనుమాన పడుతున్నారు.