త్వరలోనే నిశ్చితార్థానికి రెడీ అయిన జబర్దస్త్ కమెడియన్?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంతేకాకుండా ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కూడా చాలా పాపులర్ అయ్యారు.ఇలా పాపులర్ అయిన వాళ్ళలో మొదటగా సుధీర్, రష్మి జంట ఒకటి. ఆన్ స్క్రీన్ మీద సుధీర్, రష్మీ మధ్య నడిచే ట్రాక్ వల్ల వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇలాంటి ట్రాక్ లకి కొదువలేదు. సుధీర్, రష్మి లాగా ఎన్నో జంటలు జబర్ధస్త్ స్టేజ్ మీదే పెళ్ళి చేసుకున్నారు. కానీ ఇదంతా కేవలం టీఆర్పీ కోసం మాత్రమే. అయితే జబర్దస్త్ లో ఇలాంటి టిఆర్పి కోసం నటించే ప్రేమ జంటలు మాత్రమే కాకుండా కొన్ని రియల్ ప్రేమ జంటలు కూడా బయటపడ్డాయి. రాకేష్‌ మరియు సుజాతల ప్రేమ జోడీ ఒకటి కాగా నూకరాజు ఇంకా ఆసియాల జోడీ.

ప్రస్తుతం నూకరాజు మరియు ఆసియాల ప్రేమ విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిది మతాలు వేరు కావటం వల్ల వీరి ప్రేమ వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొంతకాలం క్రితం వరకు వరకు కుటుంబ సభ్యులకు భయపడి వీరి ప్రేమ విషయాన్ని బయటకు చెప్పేందుకు ధైర్యం చేయలేదు. కాని తాజాగా ఇద్దరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేశారు. ఈ సందర్భంగా నూకరాజు స్టేజ్ మీద ఆసియా కాళ్లు పట్టుకున్నాడు. ఆ సంఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులకి ఒక క్లారిటీ వచ్చింది.

తాజాగా నూకరాజు నిశ్చితార్థానికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. జబర్దస్త్ కమెడియన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. వీరిద్దరి మతాలు వేరు అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకరించినట్టు ఈ సందర్భంగా అతను తెలియజేశాడు. ఇలా జబర్దస్త్ కి చెందిన వ్యక్తి నూకరాజు నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకులు కూడా ఈ విషయంలో నిజం ఉంది అంటూ నమ్ముతున్నారు. నూకరాజు , ఆసియా వివాహబంధంతో ఒక్కటైతే జబర్దస్త్ చరిత్రలోనే వివాహం చేసుకున్న మొదటి జంటగా వీరు నిలిచిపోతారు.