రష్మి మీద కన్నేసిన జబర్ధస్త్ బాబీ తండ్రి.. ముసలోడు మామూలోడు కాదుగా…!

ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మి తర్వాత జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. జబర్దస్త్ లో రష్మి తన యాంకరింగ్ తో పాటు తన అందంతో కూడా ప్రేక్షకులని అలరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా యాంకరింగ్ చేస్తోంది. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు.

ఈ షోలో కమెడియన్స్ తో పాటు వారి తండ్రులు కూడా సందడి చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన స్పెషల్ షో లో నూకరాజు తండ్రి, బుల్లెట్ భాస్కర్ తండ్రి, బాబీ తండ్రి, సుజాత తండ్రి తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని బాగా అలరించారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి బుల్లెట్ భాస్కర్ మీద సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించాడు. ఇక ఈ షో లో జబర్ధస్త్ బాబీ తండ్రీ చేసిన పనికి అక్కడున్నవారందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో బాబి తన తండ్రిని ఎందుకు వచ్చావు? అని అడగగా.. రష్మీ ఉంది కదా అందుకే వచ్చాను అంటు సమాధానం చెప్పాడు.

ఇక రష్మి ఫోన్ నెంబర్ ఇస్తుందేమో అని ఆశపడి రెండు చీటీలలో ఫోన్ నెంబర్ కూడా రాసుకొచ్చాడు. రెండు చీటీలు ఎవరికోసం అని అడగ్గా ఒకటి రష్మీ కోసం ఇంకొకటి పూర్ణ కోసం అని చెప్పాడు. ఇక తన తండ్రిని భరించలేక బాబి స్టేజ్ మీద నుంచి తన తండ్రిని తీసుకెళ్తుండగా.. ఇంకొక పని ఉంది ఆగు.. అంటూ రష్మీ వద్దకు వస్తాడు. మోకాళ్ళ మీద కూర్చుని నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ..నువ్ ఏడిస్తే మాత్రం నేను భరించలేను అంటూ సుధీర్ డైలాగ్ ని చెప్తూ రష్మి కి చెప్పి ప్రపోజ్ చేసాడు. బాబి తండ్రి చేసిన పనికి అక్కడున్నవారందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ స్కిట్ చూసిన ప్రేక్షకులు ముసలోడు మామూలోడు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.