వీకెండ్ పార్టీలో డ్రింక్ తాగుతూ రచ్చ చేసిన జబర్ధస్త్ యాంకర్ రష్మీ?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మికి సరైన గుర్తింపు లభించలేదు. ఆ సమయంలో ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లో యాంకర్ గా అవకాశం రావడంతో రేష్మి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. వచ్చీరాని తెలుగు భాష మాట్లాడుతూ.. తన అందాలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు నటిగా నిత్యం బిజీగా ఉంటుంది.

ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి యాంకర్ గా కన్నా సుడిగాలి సుదీర్ తో ఉన్న లవ్ ట్రాక్ వల్ల రేష్మి మరింత పాపులర్ అయింది. జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఈటీవీలో ప్రసారమైన ప్రతి ఈవెంట్ లో కూడా రేష్మి చేసే సందడి అంతా ఇంతా కాదు. రష్మీ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా నటించింది. రష్మీ హీరోయిన్ గా నటించిన గుంటూరు టాకీస్ సినిమా ఆమె జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ద్వారా గుర్తింపు రాకపోయినప్పటికీ ఈ సినిమాలో నటించడం వల్ల రష్మి చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇలా ఒక వైపు బుల్లితెర మీద యాంకర్ గా, మరొకవైపు సినిమాలతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

తన అందమైన ఫోటోలు, వీడియోలతో పాటు లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. స్వతహాగా పెట్స్ పట్ల ఎంతో ప్రేమగా ఉండే రష్మి తరచూ వాటి గురించి పోస్టులు షేర్ చేస్తు ఉంటుంది. తాజాగా రష్మి వీకెండ్ లో తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మీ గౌతమ్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్ లో సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తోంది.ఈ వీడియోని రష్మి సోషియల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు మద్యం సీసా ఎమోజీలను షేర్ చేస్తూ క్రేజీగా చీర్స్ చెబుతు కామెంట్లు చేస్తున్నారు.