Anchor Suma: ఒక ఈవెంట్ కి సుమ తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Anchor Suma : ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఇంట్లో మనిషి లా కలిసిపోయింది.ప్రస్తుతం ఎంతో మంది కొత్త యాంకర్లు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా కూడా సుమకి ఎవరు పోటీగా నిలబడలేక పోతున్నారు. సుమ తన మాటలతో మాయ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది
ఇలా ఒక వైపు టీవీ షో లోకి యాంకర్ గా మాత్రమే కాకుండా మరొకవైపు వరుస సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది.

ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా సుమ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . అంతేకాకుండా కొంతకాలం నుండి సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నిత్యం తన అభిమానులతో టచ్ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమ చేసే వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు సైతం సుమ డేట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందంటే ఇండస్ట్రీలో ఆమెకి ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం అవుతుంది.

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లో సుమ యాంకర్ గా ఉంటుంది. యాంకర్ గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సుమ ఇటువంటి ఈవెంట్స్ లో ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న అనుభవం ఉంటుంది. అందువల్ల సుమ యాంకరింగ్ అంటే దర్శక నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు ఫుల్ రిలాక్స్ అవుతారు. ఇక ఇలాంటి ఈవెంట్ లకి సుమ తీసుకొనే రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కి సుమ దాదాపు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఎంత పెద్ద హీరో అయినా, ప్రొడ్యూసర్ అయిన మొదట రెమ్యూనరేషన్ ఫిక్స్ అయితే తప్ప సుమ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదట.