Siri: ఇప్పటికి సిరిని అర్థం చేసుకోవటం చాల కష్టం.. సిరి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శ్రీహాన్..!

Siri: సిరి హన్మంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్స్‌, యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌తో పాపులర్‌ అయిన సిరి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తన పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న సిరి ఈ షో ద్వారా నెగిటివిటీ మూటకట్టుకుని పాపులర్ అయింది. బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది వచ్చే అవకాశాలను అందుకంటే.. బిగ్ బాస్ హౌస్ లో షణ్మఖ్ తో కలిసి హద్దులు మీది ప్రవర్తించటంతో ఆమే చాల నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బయట తను ప్రేమించిన వ్యక్తి చూస్తున్నాడు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా అలా ప్రవర్తించడంతో ఆమె మీద విమర్శలు వచ్చాయి.

బిగ్ బాస్ లో వీరిద్దరి ప్రవర్తన కారణంగా ఎంతో కాలం కలసి ఉన్న దీప్తి – షణ్ముఖ్ విడిపోయారు. వీరిలాగే సిరి- శ్రీ హాన్ కూడ విపోయారని వార్తల వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఇద్దరు ప్రూవ్ చేశారు. ఇటీవల యాంకర్ రవి బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ లో ప్రియాంక, ప్రియా, సిరి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో రవి బిగ్ బాస్ కంటెస్టెంట్ ల తో కలిసి చాలా సందడి చేశాడు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సిరి గురించి శ్రీహాన్ మాట్లాడుతు ఒక వీడియో పంపాడు. అందులో సిరి పడిన కష్టాలు, సిరి గొప్పతనం గురించి శ్రీహాన్ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. సిరిని అర్థం చేసుకోవటం చాల కష్టం. తనని అర్థం చేసుకోవటానికి ఎవరికైనా చాల సమయం పడుతుంది. వైజాగ్ లో ఉన్నప్పటి నుండి సొంతంగా ఎవరి సహాయం తీసుకోకుండా ఇంత వరకూ వచ్చింది. యాంకర్ గా మొదలు పెట్టిన తను సీరియల్ ,సినిమాలు, వెబ్ సీరీస్ ఇప్పటి బిగ్ బాస్ వరకూ తన సొంత కష్టంతో పైకి ఎదిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా శ్రీహాన్ సిరి గురించి చాలా ఆసక్తికర విషయాలను తెలియ చేశాడు.సిరి గురించి ఎంత మాట్లాడినా కూడా తనని అర్థం చేసుకోవటం ఇప్పటికీ చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు.