కేసీఆర్ ఓటమికి అతిపెద్ద అస్త్రాన్ని బయటకి తీసిన ఉత్తమ్ !

uttam kumar reddy

  దుబ్బాక ఉప పోరులో విజయం దిశగా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికారంలో ఉన్న పార్టీ గతంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చటం, కొత్తగా మరికొన్ని హామీలు ఇవ్వటం లాంటివి చేస్తుంది. ఇందులో భాగంగా తెరాస ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొన్ని హామీలు దుబ్బాకలో నెరవేర్చటానికి సిద్ధమైంది. మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొంటాం అని, ఉద్యోగులకు డి ఎ ఇస్తామని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు సంధించాడు.

kcr uttam

కేసీఆర్ కు ఎన్నికలు వస్తేనే తాను ఇచ్చిన హామీలు గుర్తుకువస్తాయి తప్పితే, మిగతా సమయాల్లో గుర్తురావు. మొన్నటివరకు డీ ఏ అంటే కుక్కతోక అంటూ అవహేళన చేసిన కేసీఆర్ నేడు డీ ఏ  ప్రకటించారు,మొక్కజొన్న పంటలే వేయోడ్డు అని 1200 రూపాయలకు దేశమంతా దొరుకుతున్నాయి అని మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మద్దతు ధర 1,850 పెట్టి కొంటాం అని అన్నారంటే అది కచ్చితంగా దుబ్బాక ప్రజల నైతిక విజయమనే చెప్పాలి. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న కేసీఆర్ ఈ రెండు హామీలు ఇవ్వటానికి సిద్ధమైయ్యాడు. ఇక ఎన్నికల్లో ఓడిస్తే ఆ భయంతో మిగిలిన హామీలు అన్ని నెరవేరుస్తాడంటూ ఉత్తమ్ కుమార్ కేసీఆర్ పై విసుర్లు సంధించాడు.

దుబ్బాక ఎన్నికల్లో తెరాస పార్టీని ఓడించటానికి తమకున్న అస్త్రాలన్నింటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. మొదట దుబ్బాకకు, సిద్దిపేట కు పోలిక చేస్తూ విమర్శలు చేశారు, ఇప్పుడు ఎన్నికల కోసమే హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈ రకమైన అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఈ విధంగా అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఎలాగైనా సరే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకోని రావాలని రాష్ట్ర స్థాయి నేతలు గట్టిగానే పోరాటం చేస్తున్నారు.