అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ లేవనెత్తే అంశాలు

kcr jagan telugu rajyam

 తెలుగు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగబోతుంది. గత కొద్దీ నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ భేటీ ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో వెబినార్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

   ఈ సమావేశంలో బలమైన వాదనలు వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సీఎం కేసీఆర్ గత కొద్దీ రోజులు ఉన్నతాధికారులతో దీనిపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లేవనెత్తాల్సిన అంశాల గురించి కేసీఆర్ అధికారులతో మాట్లాడి కొన్ని అంశాలను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

cm kcr telugu rajyam

 

తెలంగాణ వాదనలు

  • కొత్త రాష్ట్రము తెలంగాణకు ఏడాదిలోనే కేటాయించాల్సిన నీటి వాటాను ఆరేళ్ళు అయినా తేల్చకపోవటం
  • పోలవరం వాటాకు సంబంధించిన కృష్ణ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీలు వాటా
  • పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ భారీ ఎత్తున నీటిని పెన్నా బేసిన్ కు తరలించటం. కేంద్రం దృషికి తీసుకోని వెళ్లిన స్పందించకపోవటం.
  • ఏకపక్షంగా, ఎలాంటి అనుమతుల్లేకుండా చేపడుతున్న రాయలసీమ, ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను నిలిపివేయించటం
  • తెలంగాణ ప్రాజెక్టులు కొత్తవి అంటూ చీటికిమాటికి ఆంధ్ర ప్రదేశ్ పిర్యాదు చేయటం

పైన పేర్కొన్న అంశాలను అపెక్స్ కౌన్సిల్ భేటీలో లేవనెత్తి వీటిపై తమ వాదనలను బలంగా వినిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణహించినట్లు తెలుస్తుంది.