తెలంగాణ లో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతోంది అనే విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సంచలనాలకు దారి తీస్తుంది. తెలంగాణ లో రాజన్న రాజ్యం లేదు.. రాజన్న రాజ్యం తీసుకోని రావటమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. నల్గొండ జిల్లా కు చెందిన వైఎస్ సానుభూతి పరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించిన వార్తలు అన్ని ఛానల్ లో పత్రికల్లో వచ్చాయి కానీ, సాక్షి లో మాత్రం ఒక్క కాలమ్ న్యూస్ కూడా రాకపోవటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది.
తెలంగాణ లో పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిలకు కలగటం వెనుక సీఎం జగన్ భార్య భారతి కూడా కారణమని చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి 2019 విశాఖ లోక్ సభ స్థానం సీటు ఇస్తామని చెప్పాడు కానీ అప్పుడు అది సాధ్యపడలేదు దీనితో 2020 రాజ్యసభ కు పంపిస్తామని మాట ఇచ్చాడు. కానీ అది కూడా కుదరలేదు. దీనితో అన్నకు చెల్లికి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని వైఎస్ కు షర్మిలకు బాగా దగ్గరి వ్యక్తి అయిన గోనె ప్రకాశరావు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో కుండ బద్దలు కొట్టాడు.
షర్మిలకు ఈ రెండు సందర్భాల్లో మొండిచెయ్యి ఎదురుకావడం వెనుక భారతి హస్తముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి లో షర్మిల గురించి కవరేజ్ పూర్తి గా తగ్గడానికి భారతి ఆజ్ఞ లే కారణం అని మీడియా వర్గాల్లో ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారతి షర్మిలల మధ్య వివాదానికి ప్రధాన కారణం విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని, జగన్ మీద ఉన్న కేసుల దృష్ట్యా ఒకవేళ ఏదైనా అనూహ్య పరిస్థితులు ఏర్పడి జగన్ జైలుకు వెళ్ళాల్సి వస్తే, షర్మిల ఇప్పటినుండే పవర్ సెంటర్ గా మారితే, అప్పుడు ముఖ్యమంత్రి పదవికి తాను ప్రధాన పోటీదారు అవుతుందని,అలా జరగడం భారతి కి ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి భారతి చేపట్టేలా పార్టీలో ఇప్పటికే వ్యూహ రచన జరిగిందని ఆ మధ్య రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
గతంలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని ముందుకు నడిపిన అనుభవం షర్మిలకు ఉంది. అయితే పార్టీ పరంగా ఆమెకు దక్కాల్సిన గుర్తింపు రాలేదనే ఆవేదన కూడా ఆమెకు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె పార్టీ గురించి వెంటనే ప్రకటన చేయకుండా కీలక చర్చలు జరుపుతున్న అంటూ మాట్లాడింది. ఈ మాటలు జరిగే సమయంలో తన అన్న వదినల నుండి ఏమైనా వర్తమానాలు అందితే పార్టీ పెట్టాలనే విరమించుకోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి