విజయ్ దేవరకొండ కెరీర్ ప్రమాదంలో ఉందా?

గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాలో తన నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ఆ యాటిట్యూడ్..ఆ తల పొగరు.. ఆ కోపం..జనాలకు పిచ్చి పిచ్చిగా..పిచ్చేక్కేలా చేసింది. అయితే, ఆ యాటిట్యూడ్ సినిమా ల వరకు అయితే పర్వాలేదు. కానీ నిజ జీవితంలో కూడా అలానే బీహేవ్ చేస్తా అంటే తేడా కొట్టేస్తుంది. ఎదుటివాళ్ళకు కోపం తెప్పిస్తుంది. ఉన్న క్రేజ్ కాస్తా పోయే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో అదే జరుగుతుంది.

‘లైగర్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా మందికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఆ మధ్య స్టార్ హీరోలను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసాడు. దానికి బండ్ల గణేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికోసం ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు. అంతా బాగానే ఉంది…కానీ, అక్కడ విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరు మాత్రం అందరికి నచ్చలేదు. ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కూర్చున్న విధానం హాట్ టాపిక్ అయ్యింది. అతడు ఎదురుగా ఉన్న టేబుల్ పై రెండు కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం అక్కడకు వచ్చిన జనాలకు కోపం తెప్పించింది. దీంతో ఈ ఇష్యూ వివాదాస్పదమైంది. దీని గురించి ఓ విలేకరి కూడా అడగడం జరిగింది. దానికి ఆయన ఆన్సర్ వింటే..షాక్ అవ్వాల్సిందే. “మీరు కూడా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చొని ప్రశ్నలు అడగవచ్చు”..అంటూ విజయ్ దేవరకొండ సచెప్పుకొచ్చాదు.

సినిమా ఆడితే పర్వాలేదు, కానీ ఒకవేళ ఏదైనా తేడా కొట్టి సినిమా ప్లాప్ అయితే మాత్రం విజయ్ కెరీర్ కి ఇబ్బందులు తప్పవు. ఆ ఆటిట్యూడ్ వాళ్ళ వొచ్చే అవకాశాలు కూడా రావడం ఆగిపోవద్దు. ఏది ఏమైనా విజయ్ సీనియర్ హీరోలను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడం మంచిది.