Mallemala: హైపర్ ఆది సుడిగాలి సుదీర్ మల్లెమాల పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?

Mallemala: బుల్లితెర ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి మూలస్తంభంగా ఉన్నటువంటి హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి కంటెస్టెంట్ లను మల్లెమాల పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఈ కార్యక్రమంలో కనిపించని వీళ్లిద్దరు ఇతర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లెమాల వారికి వీరికి మనస్పర్థలు ఉండటం వల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని చాలామంది భావించారు.

నిజానికి హైపర్ ఆది సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లి పోవడానికి అసలు కారణం ఏంటి అనే విషయానికి సంబంధించిన ఒక వార్తా వైరల్ అయింది. మల్లెమాల గారు కాస్ట్ కటింగ్ పేరుతో కొంత మంది కంటెస్టెంట్ లను తొలగించడం జరిగింది. ఈ కాస్ట్ కటింగ్ పేరుతో ఎక్కువ పారితోషకం తీసుకున్న వారిని తొలగించి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు.ఇలాంటి స్టార్ కమెడియన్స్ ఈ కార్యక్రమంలో లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమం అదే స్థాయిలో రేటింగ్ దక్కించుకుంటే తిరిగి ఆ కంటెస్టెంట్ లను జబర్దస్త్ కార్యక్రమానికి ఆహ్వానించారు.

అలా కాకుండా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ గెటప్ సీను కంటెస్టెంట్ లు లేకపోయినా కార్యక్రమ రేటింగ్ అమాంతం పడిపోతే తిరిగి వీళ్ళని ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. ఇలా ఉద్దేశపూర్వకంగానే మల్లెమాల వారు కాస్ట్ కటింగ్ పేరుతో పలువురు కంటెస్టెంట్ లను ఈ కార్యక్రమం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమం రేటింగ్స్ పడిపోతే వీరిని తిరిగి తీసుకు వస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.