Jr.NTR -Korataala Shiva: తారక్ -కొరటాల సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం ఇదేనా?

Jr.NTR -Korataala Shiva:యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక అప్పటినుంచి ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే తారక్ సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన RRR ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది ఈ సినిమాని ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తన తరువాత చిత్రాన్ని పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నటించగా అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ ప్రమోషన్ లో ఎంతో బిజీకానున్నారు.