Big Boss Season6 : బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్న కంటెస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ ఇదేనా..?

Big Boss Season 6 : టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత మంచి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్లు ప్రసారమైన ఐదు బిగ్బాస్ సీజన్ ల తో పాటు ఓటిటి లో ప్రసారమైన నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ నాన్ స్టాప్ సీజన్లో బిగ్బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక లేడీ కంటెస్టెంట్ టైటిల్ దక్కించుకొని చరిత్ర సృష్టించింది. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్న బిందు మాధవి కి ప్రస్తుతం ఆఫర్లు వరుసకడుతున్నాయి.

ఇదిలా ఉండగా బిగ్బాస్ సీజన్ 6 కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూలై మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బిగ్బాస్ సీజన్ కారులో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్ లో టాప్ 7 కంటెస్టెంట్ లలో ఉన్న అజయ్, మిత్రశర్మ, శివ, అనిల్ రాథోడ్ బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం ఉంది.

వీరితో పాటు బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్ ఉదయభాను కూడా ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ని సంప్రదించినట్లు సమాచారం. ఇక యూట్యూబర్ నికిల్, ఆర్జే హేమంత్, ప్రముఖ న్యూస్ రీడర్స్ రోజా, ప్రత్యూష లో ఎవరో ఒకరు ఈ సీజన్ 6 లో కనిపించే అవకాశం ఉంది. సింగర్ మామ సింగ్ అలియా కృష్ణ చైతన్య కూడా సీజన్ 6 కి రానున్నట్టు సమాచారం. ఇదిలఉండగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉందని నాగార్జున గారు కూడా ప్రకటించారు. మొత్తానికి ఈ సీజన్ 6 లో ఎవరెవరు పాల్గొంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.