Sai Pallavi: సాయిపల్లవి మొటిమల వెనుక అంత పెద్ద కథ ఉందా.. అయ్యో!

Sai Pallavi: సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న ప్రతి ఒక అమ్మాయికి అబ్బాయికి వారి శరీరంలో ఎన్నో మార్పులు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మార్పుల్లో భాగంగా మొహంపై మొటిమలు మచ్చలు ఏర్పడటం ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంది. అయితే ఎప్పుడు ఈమె మొటిమల విషయంలో ఎప్పుడు బాధ పడలేదు. ఇక ఒకానొక సందర్భంలో ఆమె తన మొటిమల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

మొహం పైన మొటిమలు ఏర్పడినప్పుడు చాలామంది అమ్మాయిలు ఎంతో బాధపడుతూ వారిపై వారికున్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కానీ సాయిపల్లవి మాత్రం తనకు ఆ మొటిమలు తన ముఖానికి అందం అని తెలిపారు. మొదట్లో నేను కూడా అందరిలాగే బాధపడ్డాను ఆ తర్వాత నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని ఆమె తెలిపారు. అయితే నా మొహం పై ఇలా మొటిమలు ఉన్నప్పటికీ నాకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు.

నేను డాన్స్ షో పూర్తి చేసి మెడిసిన్ చదవడం కోసం జార్ఖండ్ వెళ్ళినప్పుడు అలా నాలుగో సంవత్సరం చదువుతున్న సమయంలో డైరెక్టర్ ఆల్ఫాన్సో తనకు ఫోన్ చేస్తే ఇలా ఒక ప్రేమకథ ఉన్న సినిమాని తీయాలనుకుంటున్నాను అందులో మీరు హీరోయిన్ ఈ సినిమా చేస్తారా అని అడిగారు. మొదట్లో తన నమ్మక పోయే సరికి ఆయన తన వికీపీడియా చూడమని చెప్పాడు. అలా తన గురించి తెలుసుకోవడంతో అతను ఒక పెద్ద డైరెక్టర్ అని తెలియగానే వెంటనే ఇప్పుడు కుదరదు సెలవుల్లో చేస్తానని చెప్పాను. అలా నా మొదటి సినిమా ప్రేమమ్ ఎలాంటి మేకప్ లేకుండా మొటిమలతోనే ఆ సినిమాలో నటించానని తెలిపారు. ఇలా సినిమాలో నన్ను చూడటం వల్ల ఎంతో మంది అమ్మాయిలకు వారిపై ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.