అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఇండస్ట్రీలో వరస హిట్ లతో దూసుకుపోతున్నాడు. సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య గురించి కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాగచైతన్య హీరోయిన్ తో రిలేషన్ లో ఉండటంవల్ల సమంతకి విడాకులు ఇచ్చాడని వార్తలు వినిపించాయి. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి నాగచైతన్య ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే వీరిద్దరి గురించి వస్తున్న వార్తల వెనుక సమంత ఉందని గతంలో నాగ చైతన్య పీఆర్ టీం ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి సమంత స్పందిస్తూ..ఓ అమ్మాయిపై రూమర్స్ వస్తే అవి నిజాలు, అబ్బాయిపై వస్తే వాటి వెనుక అమ్మాయి ఉందంటారా? అంటూ ఫైర్ అయ్యింది. ఇక ఇటీవల శోభిత ధూళిపాళ్ళ కూడా మిడిల్ ఫింగర్ చూపిస్తు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వారి గురించి వస్తున్న వార్తలు ఖండిస్తూ ఇలా పోస్టు చేసింది. ఇక ట్విట్టర్ లో శోభిత పేరుతో ఓ ఫేక్ అకౌంట్ నుంచి సమంతని విమర్శిస్తూ చేసిన పోస్ట్ వైరల్ ఐంది. ఈ విషయం గురించి శోబితా స్పందిస్తూ.. తనకు ఇంస్టాగ్రామ్ లో తప్ప ఇతర సోషల్ మీడియా అకౌంట్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చి అది ఫేక్ అకౌంట్ అని తేల్చేసింది.
ఇక తాజాగా శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో లైవ్ లో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు శోభిత చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు నాగచైతన్య తో రిలేషన్ గురించి ప్రశ్నలు వేశారు. అయితే శోభిత ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. ఈ ఘటనతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ కొందరు నెటిజన్స్ పుకార్లు పుట్టిస్తున్నారు. నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా శోభిత తప్పించుకోవటంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య కూడా ఈ విషయం గురించి స్పందించకపోవడం తో ఈ వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు.