రామ్ ప్రసాద్ జబర్ధస్త్ లో కంటిన్యూ అవ్వటానికి వారే కారణం..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకులలో ఎంత మంచి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. దీంతో వీరికి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. మంచి సినిమా అవకాశాలు రావటంతో ఇప్పటికే గెటప్ శ్రీను, సుధీర్ జబర్ధస్త్ మానేసి పూర్తిగా సినిమాలు చేస్తు బిజిగా ఉన్నారు. ఆది కూడా ప్రస్తుతం జబర్ధస్త్ లో కనిపించటం లేదు.

ఈ ముగ్గురు లేని లోటు జబర్ధస్త్ లో బాగా కనిపిస్తోంది. వీరు తిరిగి జబర్ధస్త్ కి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ అది జరిగేలా కనిపించటం లేదు. ఇదిలా ఉండగా సుధీర్ టీమ్ లో శ్రీను, సుధీర్, రాంప్రసాద్ ఉండగా ప్రస్తుతం రామ్ ప్రసాద్ మాత్రమే జబర్ధస్త్ లో స్కిట్ లు చేస్తున్నాడు. సుధీర్, శ్రీను లాగా రాంప్రసాద్ కి సినిమా ఆఫర్లు రాలేదా? అని అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ముగ్గురు కలిసి ప్రేక్షకులని అలరించారు. వీరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ఇప్పటికే జబర్ధస్త్ లో స్కిట్ కూడా చేశారు. అయితే రామ్ ప్రసాద్ జబర్ధస్త్ లో కంటిన్యూ అవ్వటానికి గల కారణం గురించి ఇప్పుడు చర్చ మొదలయ్యింది.

రాంప్రసాద్ కి రైటర్ గా మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా కారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలలో నటించాడు. రైటర్ గా మంచి అనుభవం ఉన్న రాంప్రసాద్ కి కూడా సినిమా ఆఫర్లు వచ్ని ఉంటాయి. కానీ రాంప్రసాద్ మాత్రం జబర్ధస్త్ ని వీడకుండా ఉన్నాడు. దీని వెనుక గల కారణం గురించి ఇండస్ట్రీ వర్గాలతో వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్‌ లో రామ్‌ ప్రసాద్ కొనసాగడానికి కారణం… ఆయనకు సంబంధించిన వారు జబర్ధస్త్ డైరెక్షన్ టీమ్ లో ఉన్నారు.అందువల్ల వారు రామ్‌ ప్రసాద్‌ ను జబర్ధస్త్ వెళ్లకుండా ఆపుతున్నట్టు సమచారం. అంతేకాకుండా రామ్‌ ప్రసాద్‌ కు మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్లే రాంప్రసాద్ ఇంకా జబర్ధస్త్ లో కొనసాగుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.