తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వివి వినాయక గురించి పరిచయం అవసరం లేదు. అయితే ఈయన సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.ఈ క్రమంలోనే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకి పోటీగా బాలకృష్ణ హీరోగా ద్విపాత్రాభినయంలో చెన్నకేశవరెడ్డి సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదని చెప్పాలి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ ఈ సినిమా హిట్ కాకపోవడానికి కారణం స్క్రిప్ట్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని అయితే సినిమాని త్వరగా చేయాలన్న ఉద్దేశంలో స్క్రిప్ట్ పై తాను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయానని అందుకే సినిమా రిజల్ట్ అలా ఉందంటూ ఈయన తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో సందడి చేశారు. ఓల్డ్ గెటప్ లో ఉన్నటువంటి బాలకృష్ణ సరసన నటించడానికి టబు స్థానంలో ముందుగా సౌందర్యను తీసుకోవాలనుకున్నామని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.
ఇక ఈ పాత్ర కోసం సౌందర్యను సంప్రదించగా తాను ఓల్డ్ గెటప్స్ లో చేయనని ఒకసారి అలా చేస్తే తిరిగి మనం ఓల్డ్ పాత్రలలోకి వెళ్ళిపోతామని అందుకే తాను ఈ పాత్రలో నటించనని చెప్పడం వల్లే సౌందర్య స్థానంలో టబు నటించారని ఈ సందర్భంగా వివి వినాయక్ ఈ సినిమా విషయంలో తాను చేసిన పొరపాట్లను, సౌందర్య నటించకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.